హిమాచల్ ప్రదేశ్ లో ఫ్లాష్ ఫ్లడ్స్.. చిక్కుకుపోయిన 200 మంది టూరిస్టులు.. వీడియో ఇదిగో!
- కుండపోత వర్షాలకు మండి జిల్లాలో ముంచెత్తిన వరద
- బాఘి బ్రిడ్జి పైనుంచి ప్రమాదకరంగా ప్రవాహం
- నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
ఛంబా నుంచి విద్యార్థులతో మండి వస్తున్న బస్సు, పరాషర్ నుంచి తిరిగి వస్తున్న టూరిస్టుల వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయని పోలీసులు తెలిపారు. వరద తగ్గేవరకు బ్రిడ్జి దాటే పరిస్థితి లేదని వివరించారు. ఈ క్రమంలో వాహనాలలో చిక్కుకుపోయిన వారు ఆదివారం రాత్రి అక్కడే ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరోవైపు, పండోహ్-మండి జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసేసి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వివరించారు.