అనవసరంగా ఈ విషయంలోకి నన్ను లాగుతున్నారు: ఆషూ రెడ్డి

  • కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి స్పందన
  • తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలూ లేవని స్పష్టీకరణ
  • సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి అంతా చెబుతానని వ్యాఖ్య
  • తనపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో ఆర్థం కావట్లేదంటూ ఆవేదన
‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తన పేరు వెలుగులోకి రావడంపై బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి తాజాగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. 

తనకు డ్రగ్స్‌కు సంబంధించి ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవని, తనపై వచ్చిన వార్తలన్నీ తప్పని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి అన్ని విషయాలు చెబుతానని అన్నారు. అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ ప్రచురిస్తే అస్సలు ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు తనపై ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేపీ చౌదరి, బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ వందల సంఖ్యలో ఫోల్స్ కాల్స్ చేసినట్టు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరపైకి ఆషూ రెడ్డి పేరు రావడం సంచలనంగా మారింది.

Toll
Andhra Pradesh
Telangana

More Telugu News