వారు బతికే ఉన్నారు.. గల్లంతైన సబ్‌మెరైన్ నుంచి సిగ్నల్స్!
- టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి
- దాని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న శోధన బృందాలు
- ప్రతి అరగంటకు ఒకసారి క్రమం తప్పకుండా నీటి అడుగు నుంచి బ్యాంజింగ్ సౌండ్స్
- సబ్మెర్సిబుల్లో మరో 30 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్
బ్యాంజింగ్ సౌండ్స్ నౌక సురక్షితంగా ఉందన్న దానికి సంకేతాలని భావిస్తున్నారు. సోనార్ పరికరాలతో శోధిస్తున్న బృందాలు కూడా నీటి లోపలి నుంచి వస్తున్న బ్యాంజింగ్ సౌండ్స్‌ను గుర్తించాయి. మరోవైపు, సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన కెనడియన్ పీ-3 ఎయిర్‌క్రాఫ్ట్ కూడా నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించి ఆ వివరాలను అమెరికా నేవీ నిపుణులతో పంచుకుంది. కాగా, గల్లంతైన మినీ జలాంతర్గామిలో మరో 30 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉండడంతో ఆందోళన మొదలైంది. వీలైనంత త్వరగా నౌకను గుర్తించి అందులోని వారిని రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.