ఆన్ లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న విద్యార్థిని... చివరికి..!
- నెల్లూరు జిల్లాలో విషాద ఘటన
- నెల్లూరులో బీఫార్మసీ చదువుతున్న పోలు కవిత
- కవిత స్వస్థలం దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామం
- ఫీజు కట్టాలని కవితకు రూ.2.5 లక్షలు ఇచ్చిన తల్లిదండ్రులు
- ఆన్ లైన్ గేమ్ లో పెట్టి డబ్బంతా పోగొట్టుకున్న కవిత
- తల్లిదండ్రులు తిట్టారని పురుగుమందు తాగిన వైనం
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా ఆన్ లైన్ గేమ్ వ్యసనంతో నాశనం చేశావంటూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తిట్టారన్న మనస్తాపంతో కవిత ఐదు రోజుల కిందట పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఎదిగివచ్చిన కూతురు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.