వ్యాపారాలను విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలించాలనుకుంటున్న వైసీపీ ఎంపీ?
- ఇటీవల కిడ్నాప్ కు గురైన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు
- వ్యాపారాలు, రాజకీయాలు రెండూ విశాఖలో చేయలేనన్న ఎంపీ
- వ్యాపారాలకు అనుమతులు పొందడంలో కూడా జాప్యం జరుగుతోందని వ్యాఖ్య
ఏపీలో రాజకీయాలు, వ్యాపారాలు రెండూ ఒకేసారి కొనసాగించడం కష్టంగా ఉందని సత్యనారాయణ అన్నారు. వ్యాపారరీత్యా ఇక్కడ అవసరమైన అనుమతులు పొందడంలో కూడా జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయాలు విశాఖలో, వ్యాపారాలు హైదరాబాద్ లో చేద్దామనుకుంటున్నానని చెప్పారు. అధికార పార్టీలో ఉండటం వల్ల తనపై అసత్య ప్రచారాలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఎవరెవరో ఏదేదో అంటుంటే బాధ కలుగుతోందని చెప్పారు. కిడ్నాపర్లకు శిక్ష పడేంత వరకు న్యాయపరంగా ఎంత చేయాలో అంతా చేస్తానని తెలిపారు.