తెలుగులో పట్టుబిగిస్తోన్న మలయాళ విలన్!

Shine Tom Chacko Special
  • మలయాళంలో స్టార్ గా 'షైన్ టామ్ చాకో'
  • 'దసరా' సినిమాతో ఇక్కడ ఎంట్రీ 
  • 'రంగబలి'తోను పలకరించనున్న నటుడు 
  • 'దేవర'లోను పవర్ఫుల్ రోల్ చేస్తున్న చాకో
ఒకప్పుడు తెలుగు తెరపై బాలీవుడ్ విలన్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అప్పుడప్పుడు ఇతర భాషల విలన్లు ఇక్కడ తెరపై కనిపించినప్పటికీ, బాలీవుడ్ విలన్లదే పై చేయిగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మలయాళం నుంచి కూడా ఇక్కడి తెరపైకి విలన్లు దిగిపోతున్నారు.

ఇంతకుముందు ఇక్కడ మలయాళ హీరోయిన్స్ సందడి మాత్రమే కనిపిస్తూ ఉండేది. మమ్ముట్టి . మోహన్ లాల్ .. సురేశ్ గోపీ వంటి హీరోల అనువాదాలు ఇక్కడ రావడం వలన వాళ్లు బాగా తెలుసు. అలాంటిది ఎప్పుడైతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వెలిశాయో అప్పటి నుంచి మలయాళ విలన్ల హవా కూడా తెలుగులో కనిపిస్తోంది. 

మలయాళంలో 'షైన్ టామ్ చాకో' స్టార్. ఆయన తన కెరియర్ ను మొదలెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. 'దసరా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన, విలన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక 'రంగబలి' సినిమాలోను పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. ఎన్టీఆర్ 'దేవర' సినిమాలోనూ ఆయనది పవర్ఫుల్ రోల్. 'దేవర' తరువాత ఆయన ఇక్కడ మరింత బిజీ అయినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. 
Go Back to Shorts
Shine Tom Chacko
Actor
Devara Movie

More Telugu News