Andhra Pradesh: నన్ను అక్కడే సమాధి చేయాలి: రాకేశ్ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మరణం తెలుగు చిత్ర సీమలో విషాదం నింపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. అయితే, తాను చనిపోయాక ఎక్కడ ఖననం చేయాలో రాకేశ్ మాస్టర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
తన మామగారి (భార్య తండ్రి) సమాధి పక్కనే ఓ వేప మొక్క నాటానని, తాను మరణించాక ఆ చెట్టు వద్దే సమాధి చేయాలని రాకేశ్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు తమ్ముడంటే చాలా ఇష్టమని చెప్పిన రాకేశ్ మాస్టర్, తనకు తల్లి మరణించాక జీవితం మీద విరక్తి పుట్టిందని కూడా చెప్పుకున్నారు. తన తల్లి తరువాత అక్క కుమారుడు, తండ్రి కూడా మరణించడంతో చావు అంటే భయం లేకుండా పోయిందని కూడా ఓ సందర్భంలో రాకేశ్ మాస్టర్ కన్నీటిపర్యంతమయ్యారు.