ఈ నెల 19 నుంచి ఏపీలో వర్షాలే వర్షాలు
- రేపటి నుంచి రాష్ట్రంలో విస్తరించనున్న రుతుపవనాలు
- నేడు, రేపు ఎండల తీవ్రత తప్పదంటున్న వాతావరణ శాఖ
- రాష్ట్రంలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి
కోస్తాంద్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. శని, ఆది వారాల్లో (నేడు, రేపు) రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.