బాసరలో మరో విద్యార్థిని మృతి

  • బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత
  • బుధవారం అర్ధరాత్రి హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడ్డ వైనం
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల ధ్రువీకరణ 
బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లిఖిత హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి కిందపడింది. ఆమెను నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం గోపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

Telangana

More Telugu News