అమిత్ షా, జేపీ నడ్డాల అవినీతి ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందన
- అవినీతి ఎక్కడ జరిగిందో ఇద్దరూ చెప్పలేకపోయారన్న విజయసాయి
- కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని వ్యాఖ్య
- ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని స్పష్టీకరణ
వైసీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందని అమిత్ షా, జేపీ నడ్డా ఆరోపణలు చేశారనీ... అయితే, అవినీతి ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేకపోయారని విజయసాయి అన్నారు. ఆడిటింగ్ లో ఏమైనా అవినీతిని గుర్తించారా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా వైసీపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. ఏపీ పరిపాలన రాజధాని విశాఖలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.