China Gymnasts: వీళ్లు వృద్ధులు అంటే నమ్మలేరు!

తాజాగా ఇంటెర్నెట్ ను ఓ వీడియో ఊపేస్తోంది. అందులో కొందరు చైనా జిమ్నాస్ట్ లు విన్యాసాలు చేస్తుండడం చూడొచ్చు. జిమ్నాస్ట్ లు విన్యాసాలు చేయడం కొత్తేమీ కాదు కదా... ఇందులో వింతేముంది అంటారా...! ఆ జిమ్నాస్ట్ లేమీ కుర్రవాళ్లు కాదు... 67 నుంచి 80 ఏళ్ల వయసున్న వారు. అందుకే ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఈ వయసులోనూ చైనా జిమ్నాస్ట్ లు తమ శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటున్న తీరు, ఇంకా నిలిచి ఉన్న వారి జిమ్నాస్టిక్ నైపుణ్యానికి మచ్చుతునకగా ఆ వీడియో నిలుస్తుంది. ఐరన్ బార్ పై వాళ్లు చేస్తున్న విన్యాసాలు చూస్తే 70, 80 ఏళ్ల వృద్ధులంటే ఎవరూ నమ్మరు. 

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఈ వీడియో చూసి అచ్చెరువొందారు. ఆదివారం వస్తే శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, కానీ వీడియో చూశాక జిమ్ కు వెళుతున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
China Gymnasts
Old Age
Video
Age No Question

More Telugu News