సర్‌‌ప్రైజ్.. థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ చిత్రం

 2018 arrives on OTT earlier than the scheduled time
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘2018’. మలయాళంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బలమైన కంటెంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది. పబ్లిక్ టాక్ తోనే సూపర్ హిట్ గా మారింది. ఆ తర్వాత తెలుగు సహా పలు భాషల్లో విడుదలైంది. 2018లో కేరళ రాష్ట్రంలో సంభవించిన విధ్వంసకర వరదల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మలయాళంలోనే 80 కోట్లు, మొత్తంగా 150 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. తెలుగులో మే26న విడుదలైన ఈ చిత్రానికి టాలీవుడ్‌లోనూ మంచి స్పందన వచ్చింది. 

థియేటర్లలో ఉండగానే అనూహ్యంగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నారాయణ్, తన్వి రామ్, జాయ్ మాథ్యూ తదితరులు నటించారు.
Go Back to Shorts
2018 movie
OTT
Sonyliv
streaming

More Telugu News