తీవ్రమైన గుండెపోటు ఘటనలు సోమవారమే ఎక్కువట.. తాజా అధ్యయనంలో వెల్లడి!
- స్టెమీ రకమైన గుండెపోటుపై ఐర్లాండ్ పరిశోధన సంస్థ అధ్యయనం
- 2013 నుండి 2018 వరకు 10,528 మందిపై పరిశోధన
- ఆదివారం రోజు స్టెమీ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడి
ప్రత్యేకమైన ఈ స్టెమీ గుండెపోటు వారంలో మొదటి రోజు అంటే సోమవారం ఎక్కువగా కనిపిస్తోందని ఈ అధ్యయనం తెలిపింది. సోమవారం - స్టెమీ సంభావ్యతకు మధ్య బలమైన సంబంధాన్ని గుర్తించామని, ఇది గతంలో కూడా వెల్లడైందని తెలిపారు. అయితే సోమవారమే ఎక్కువగా ఈ గుండెపోట్లు ఎందుకు సంభవిస్తున్నాయో వివరించలేకపోయారు. అయితే ఈ కేసులు సోమవారం సంభవించడానికి కార్కాడియం రిథమ్ తో సంబంధం ఉందని గతంలోని అధ్యయనాలు సూచిస్తున్నాయి.