Bus accident: రైలు ప్రమాదంలో గాయాలతో బయటపడి బస్సులో ఇంటికెళ్తుంటే మళ్లీ యాక్సిడెంట్..

బాలాసోర్ రైలు ప్రమాదంలో కొద్దిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు.. గాయాలతో బయటపడి, ఆసుపత్రిలో చికిత్స పూర్తయ్యాక బస్సులో ఇంటికి బయలుదేరారు. అయితే, మృత్యువు వారినే అనుసరించిందేమో.. వారు ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయింది. దీంతో మరోసారి వారు గాయపడ్డారు. ఒక ప్రమాదం నుంచి తేరుకోకముందే మరోమారు ప్రమాదానికి గురవడంతో వారంతా భయాందోళనకు లోనయ్యారు. బెంగాల్ కు చెందిన ప్రయాణికులకు ఎదురైందీ భయానక అనుభవం.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డారు. గాయాలకు చికిత్స చేసి, ఓ బస్సులో వారిని ఇంటికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బాధితులను తరలిస్తున్న ఆ బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో యాక్సిడెంట్ కు గురైంది. పికప్ వ్యాన్ ను బస్సు ఢీ కొట్టడంతో ప్రయాణికులకు మరోమారు గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే, రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి గాయాలతో సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది.
Bus accident
West Bengal
Odisha
Train Accident
passengers

More Telugu News