కోరిక తీరిస్తే ఖర్చు భరిస్తానన్నాడు.. బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్ ఆరోపణ
- బయటపడుతున్న ఎఫ్ఐఆర్ లోని కీలక విషయాలు
- ఎఫ్ఐఆర్ కాపీలను ప్రచురించిన జాతీయ మీడియా
- తమ గదుల నుంచి బయటకు రావడమే మానేశామని ఆవేదన
- బృందాలుగా వెళ్లినా ఒక్కరిని పక్కకు తీసుకెళ్లి ప్రశ్నించేవాడని ఆరోపణ
బ్రిజ్ భూషణ్ కు భయపడి వీలైనంత వరకు తమ గదులలో నుంచి బయటకు రావడం మానేశామని రెజ్లర్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే నలుగురు ఐదుగురం కలిసి వచ్చేవారమని వివరించారు. అయినా కూడా తమలో నుంచి ఒకరిని పక్కకు తీసుకెళ్లి అసభ్యంగా మాట్లాడేవారని చెప్పారు. కోచ్ లేని సమయంలో వచ్చి తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని అన్నారు. ఒకసారి తన టీషర్ట్ లాగారని, ఛాతీ, పొట్టపై అభ్యంతరకరంగా తాకారని మరో రెజ్లర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.