కర్ణాటకలో కుప్పకూలిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్
- స్వల్ప గాయాలతో బయటపడిన ఇద్దరు పైలట్లు
- శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా బెంగళూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరిన విమానం
- చామరాజనగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో ప్రమాదం
రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగళరులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజనగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.