Amazon Echo Pop: అమెజాన్ నుంచి ఆసక్తికరమైన ఫీచర్లతో ఈకో పాప్ స్పీకర్

Amazon Echo Pop with semi sphere design pastel colour options launched in India
షార్ట్స్‌లో చూడండి
అమెజాన్ కొత్తగా ఈకో పాప్ స్పీకర్ డివైజ్ ను విడుదల చేసింది. డిజైన్ భిన్నంగా ఉండడాన్ని గమనించొచ్చు. అంతేకాదు కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఈ డివైజ్ సాయంతో క్రికెట్ స్కోర్ ఎంతుందో తెలుసుకోవచ్చు. స్మార్ట్ లైట్లు, ప్లగ్ లను నియంత్రించొచ్చు. అలారమ్, రిమైండర్లు పెట్టుకోవచ్చు. అలెక్సాకు ఇచ్చే ఆదేశాలకు వేగంగా స్పందిస్తుంది.

దీని ధర రూ.4,999. గ్రీన్, పర్పుల్, బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. క్రోమా, రిలయన్స్ డిజిటల్, పూర్వికా స్టోర్లకు వెళ్లి ఈ కొత్త స్మార్ట్ స్పీకర్ ను స్వయంగా చూసి తెలుసుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. అలెక్సా సాయంతో ఏఏ పాటలు ప్లే చేయాలో ఆదేశాలు ఇవ్వొచ్చు. స్మార్ట్ లైట్లు, ఇతర స్మార్ట్ గృహోపకరణాలను దీని సాయంతో నియంత్రించుకోవచ్చు. స్క్రీన్ లేకుండా ఆదేశాలతోనే పనిచేసే ఈ గ్యాడ్జెట్ చిన్నారులకు మంచి హుషారు ఇవ్వనుంది.
Go Back to Shorts
Amazon Echo Pop
smart speaker
launched
home gadget

More Telugu News