సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా కన్నా... చంద్రబాబు ఆదేశాలు
- మంత్రి అంబటిపై సత్తెనపల్లి బరిలో కన్నా!
- టీడీపీ ఇన్చార్జిగా నియమిస్తూ ప్రకటన చేసిన అచ్చెన్నాయుడు
- ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కన్నా
కన్నా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండడంతో, ఇప్పటికే పాక్షికంగా మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీ... నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిల నియామకంలోనూ దూకుడు పెంచింది.
కాగా, సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రేసులో జీవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, టీడీపీ నాయకత్వం కన్నా వైపు మొగ్గడంతో ఈ ప్రచారానికి తెరపడింది.