Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచంలో ఖరీదైన పాప్యులర్ స్మార్ట్ ఫోన్లు

15 most popular premium smartphones in the world
Advertisement
  • ఎక్కువ మంది ప్రాధాన్యం వీటికే
  • ఐఫోన్లు 14 ప్రో మ్యాక్స్, 14 ప్రో, ఐఫోన్ 13 పట్ల ఆసక్తి
  • ఎక్కువ కొంటున్నది ఐపీఎల్ ఫోన్లనే
  • తర్వాత స్థానంలో శామ్ సంగ్
Advertisement
ప్రపంచంలో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఎంతో  ప్రాచుర్యం సంపాదించినవి కొన్నే. కస్టమర్ల ఆదరణ చూరగొన్న ఖరీదైన ఫోన్లలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఒకటి. 128 జీబీ వేరియంట్ ధర రూ.1,27,999. తర్వాతి స్థానంలో ఐఫోన్ 14 ప్రో ఉంది. దీని తర్వాత ఐఫోన్ 14 ప్రో ధర 128 జీవీ వేరయింట్ రూ.1,19,999. ఐఫోన్ 14 128జీబీ వేరియంట్ ధర రూ.73.999. 

ఐఫోన్ 13 ధర రూ.62,990 (128 జీబీ ధర). శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 మోడల్ ప్రపంచంలోనే ఎంతో ప్రజాదరణ పొందుతున్న ఐదో ఫోన్ గా ఉంది. 12 జీబీ రయామ్, 256 జీబీ స్టోరేజ్ తో కూడిన దీని ధర రూ. 94.999. ఇక ఆరో స్థానంలో మళ్లీ ఐపీఎల్ వచ్చింది. ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.80,999. 128జీబీ దీనికే ఎక్కువ. కెనాలిస్ రూపొందించిన జాబితాలో తర్వాతి స్థానంలో శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 ఉంది. దీని ధర 128జీబీ వేరియంట్ రూ.74,998గా ఉంది.  

ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లను పరిశీలించినట్టయితే.. ఐఫోన్ 12, గెలాక్సీ ఎస్ 23 ప్లస్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, ఐఫఓన్ ఎస్ఈ (థర్డ్ జనరేషణ్), శామ్ సంగ్ గెలాక్సీ ఎస్22 128 జీబీ వేరియంట్ ధర రూ.52,999. ఇంకా షావోమీ 13, హువాయి్ మేట్ 50, శామ్ సంగ్ గెాలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ఫోన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది.
Advertisement
Advertisement
smartphones
most popular
top phones

More Telugu News