మరో కీలక బాధ్యతను చేపట్టనున్న సౌరవ్ గంగూలీ

Sourav Ganguly appointed as Tripura tourism brand ambassador
  • త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా గంగూలీ
  • ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన దాదా
  • నిన్న కోల్ కతాలో గంగూలీని కలిసిన త్రిపుర టూరిజం మినిస్టర్
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరో కీలక బాధ్యతను చేపట్టబోతున్నారు. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. కోల్ కతాలోని గంగూలీ నివాసంలో ఆయనతో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం గంగూలీ మాట్లాడుతూ... త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు గంగూలీని టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు ఇప్పటికే త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది. 

ఇంకోవైపు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందిస్తూ... తమ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే తమ ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. గంగూలీ భాగస్వామ్యం కచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని అన్నారు. ఈరోజు గంగూలీతో ఫోన్ ద్వారా మాట్లాడానని చెప్పారు.
Go Back to Shorts
Sourav Ganguly
Tripura

More Telugu News