భార్యతో గొడవ.. అడ్డొచ్చిన కూతురిని 17 సార్లు పొడిచి హత్య
- గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఘటన
- మేడపై నిద్రిద్దామన్న భార్యతో భర్త గొడవ
- కత్తితో భార్యపై దాడికి యత్నం, అడ్డొచ్చిన కూతురి హత్య
ఆ తరువాత ఇంట్లోంచి వెళ్లిపోయిన అతడు కత్తితో తిరిగొచ్చి భార్యపై దాడికి దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డొచ్చిన 19 ఏళ్ల కూతురిని 17 సార్లు దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో అతడి ముగ్గురు కుమారులు కూడా గాయపడ్డారు. కూతురిని హత్య చేశాక పరారైన నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.