Road Accident: సీబీఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల మృతి

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి సీబీఐటీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. పది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు.. ఖానాపూర్ చౌరస్తా వద్ద బస్సును ఓవర్ టేక్ చేయబోయి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. 

మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు నిజాంపేటకు చెందిన వారుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Road Accident
CBIT
Three students
dead

More Telugu News