Pawan Kalyan: పవన్‌ ‘ఓజీ’ నుంచి మరో క్రేజీ అప్​డేట్

OG has begun its second schedule in Hyderabad today
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ పేరిట భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నారు. ఓవైపు ఉస్తాద్ భగత్‌ సింగ్, హరహర వీరమల్లు, సాయిధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్‌‌తో పాటు ఈ చిత్రంలో ఒకే టైమ్ లో నటిస్తూ పవన్ బిజీగా ఉన్నారు. జనవరిలో మొదలైన ఈ చిత్రం ఒక షెడ్యూల్ షూటింగ్ ముంబైలో పూర్తయింది. 

అక్కడ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్ర బృందం హైదరాబాద్ వచ్చేసింది. ఈ రోజునుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్ లో రెండో షెడ్యూల్ షూట్ మొదలైనట్టు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ముఖ్య నటీనటులు పాల్గొంటారని తెలుస్తోంది. రీసెంట్‌ గా ఉస్తాద్ భగత్ సింగ్‌ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ తో అభిమానులకు కిక్‌ ఇచ్చారు పవన్‌. ఇప్పుడు ఓజీ నుంచి కూడా త్వరలోనే సర్‌‌ ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
og movie
sahoo
sujith
dvv danaiah

More Telugu News