Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని ముఖ్య అతిథిగా 'మేమ్ ఫేమస్' ఈవెంట్ .. ట్రైలర్ రిలీజ్!

Mem Famous trailer released
Advertisement
  • ముగ్గురు స్నేహితుల కథగా 'మేమ్ ఫేమస్'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా 
  • నాని చీఫ్ గెస్టుగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 
  • ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల
Advertisement
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల జోరు ఒక రేంజ్ లో కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు పెద్ద హిట్లను ఖాతాలో వేసుకుంటున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో సినిమానే 'మేమ్ ఫేమస్'. అనురాగ్ రెడ్డి .. శరత్ చంద్ర .. చంద్రు నిర్మించిన ఈ సినిమాకి సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించాడు. 

కొంత సేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. నాని ముఖ్య అతిథిగా .. బుచ్చిబాబు - శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో .. ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 

ముగ్గురు స్నేహితులు తమ ఊళ్లో పనీపాటా లేకుండా తిరుగుతుంటారు. తల్లిదండ్రుల చేత చీవాట్లు తింటూ ఉంటారు. ఈ ముగ్గురికీ కూడా ఎవరి ప్రేమకథలు వారికి ఉంటాయి. అయితే వీళ్ల తీరు వలన పిల్లను ఇవ్వడానికి అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇష్టపడరు. అప్పుడు ఈ కుర్రాళ్లు ఏం చేశారనేది కథ. యూత్ ను ఎంకరేజ్ చేయండి అనే లైన్ పై నడిచే కథ ఇది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా  విడుదలవుతోంది.
Advertisement
Advertisement
Sumanth Prabhas
Nani
Mem Famous Movie

More Telugu News