Tollywood: శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ అంటే..!

Sharwanand and Rakshita will tie knot on June 2nd and 3rd at the Leela Palace Jaipur
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ పెళ్లిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. శర్వా ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకున్న రక్షితతో అతని పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ.. వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ పుకార్లేనని శర్వా తన మేనేజర్ ద్వారా అధికారికంగా  ప్రకటించాడు. తను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాడు. జూన్ 2, 3వ తేదీల్లో రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా–రక్షిత వివాహం ఘనంగా జరుగుతుందని స్పష్టం చేశాడు. 

ఈ రోజు నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలైనట్టు తెలుస్తోంది. వివాహ వేడుకకు శర్వాకు చిన్ననాటి మిత్రుడైన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రక్షితా రెడ్డితో శర్వా జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
Go Back to Shorts
Tollywood
Sharwanand
wedding
Chiranjeevi
Ramcharan

More Telugu News