ఈ రోజు నేనెవరో తెలియని వారు లేరు.. 43 స్థానాల్లో మేం గట్టి ఫోర్స్: వైఎస్ షర్మిల
- ఎవరితోను పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పిన షర్మిల
- విలీనం చేయాలనుకుంటే పార్టీ పెట్టకపోయేదానినని వ్యాఖ్య
- తనకు పొత్తులపై మిస్డ్ కాల్స్ వస్తున్నాయన్న షర్మిల
తన తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి, నిజాయతీగా పాదయాత్ర చేశానని చెప్పారు. ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా లోకల్ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడానని చెప్పారు. ఈ రోజు షర్మిల అంటే తెలియని వారు తెలంగాణలో లేరన్నారు.
ఢిల్లీ సంస్థ ఒకటి సర్వే చేస్తే 43 స్థానాల్లో తమ పార్టీ గట్టి ఫోర్స్ అని తేలిందని చెప్పారు. ఈ లెక్కలు తాను చెప్పడం లేదని, ఢిల్లీ సంస్థ చేసిన సర్వే అన్నారు. ఇలాంటి సమయంలో పదికో, ఇరవైకో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. అన్ని పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తాయన్నారు. పొత్తుల కోసం తనకు కూడా మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే తాము చార్జింగ్ మోడ్ లోనే ఉన్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీని ప్రజలు బొంద పెడతారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు అయినా వస్తాయా అని ఎద్దేవా చేశారు.