నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్య
- ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు
- సీఎం సీటు కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పోటీ
- కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలకు ఢిల్లీ బయలుదేరిన డీకే శివకుమార్
- హైకమాండ్ ఆదేశాలు పాటిస్తానని వ్యాఖ్య
‘‘నేను ఎవరి మధ్యా విభజన తీసుకురాదలుచుకోలేదు. మా బలం 135 మంది సభ్యులు. వారికి నేను నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం బాధ్యతాయుతంగానే ఉంటాను. వెన్నుపోట్లు, బ్లాక్‌మెయిల్‌కు దిగను’’ అని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం సీటు కోసం ప్రయత్నిస్తున్న మరో కీలక నేత సిద్ధరామయ్య సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో, తదుపరి ఏం జరుగనుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, కర్ణాటక సీఎం ఎవరో మంగళవారమే తేలిపోతుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.