మెట్రో రైళ్లల్లో విద్యార్థులకు స్టూడెంట్ పాస్‌లు

14-05-2023 Sun 12:28 | National
Advertisement
  • స్టూడెంట్ పాస్‌లు కావాలంటూ ఎంతో కాలంగా విద్యార్థుల డిమాండ్
  • విద్యార్థుల డిమాండ్ నేపథ్యంలో సర్వే చేపట్టిన చెన్నై మెట్రో రైల్ వర్గాలు
  • మెట్రో ప్రయాణికుల్లో విద్యార్థుల వాటా 40 శాతంగా ఉన్నట్టు సర్వేలో వెల్లడి
  • సర్వే అనంతరం, రాయితీ ధరలకు స్టూడెంట్ పాస్ జారీ చేసేందుకు నిర్ణయం
Advertisement
మెట్రో రైళ్లల్లో విద్యార్థులకు పాస్‌లు ఇచ్చేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ నిర్ణయించింది. బస్సులు, రైళ్లల్లోని నెలవారీ పాస్‌ల విధానంలో మెట్రో పాస్‌లు జారీ చేయనున్నట్టు పేర్కొంది. చెన్నై మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజుకు సగటున 2 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇక, ప్రయాణికుల సౌలభ్యం కోసం చెన్నై మెట్రో రైల్ ఇప్పటికే పలు రాయితీలను అందిస్తోంది. రోజంతా ప్రయాణించేందుకు రూ.100 టిక్కెట్టు, నెలంతా ప్రయాణించేవారి కోసం రూ. 2500కు పాస్, బృందంగా ప్రయాణించే వారికి ఛార్జీల తగ్గింపు వంటి పలు రాయితీలను ప్రకటించింది. 

అయితే, తమకు అనుకూలంగా ఉండే పాస్‌లు జారీ చేయాలని కళాశాల విద్యార్థులు కొంత కాలంగా కోరుతున్నారు. ఈ క్రమంలో సంస్థ సర్వే చేపట్టగా మెట్రో ప్రయాణికుల్లో విద్యార్థుల వాటా 40 శాతం ఉన్నట్టు తేలింది. 47 శాతం మంది ఉద్యోగులు, మిగతా 13 శాతం మంది ప్రయాణికులు ఉన్నట్టు తేలింది. దీంతో, విద్యార్థుల సౌకర్యార్థం రాయితీ ధరలకు స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకురావడానికి చెన్నై మెట్రో రైల్ నిర్ణయించింది.
Advertisement
Tamilnadu

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more