ఉత్తరప్రదేశ్ అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి
- 17 మున్సిపల్ కార్పొరేషన్లకు 16 స్థానాల్లో బీజేపీ సత్తా
- అయోధ్య, లక్నోలలోను కమలం పార్టీ హవా
- ఆగ్రాలో బీఎస్పీ ముందంజ
అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ 16 చోట్ల ముందంజలో ఉంది. వారణాసిలో 16,000 ఓట్లు, లక్నోలో 1852 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఒక్క కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రమే బీజేపీ, సమాజ్ వాది పార్టీ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆగ్రాలో బీఎస్పీ 12799 ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. మీరట్ లో మజ్లిస్ పార్టీ సత్తా చాటుతోంది. వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది.