కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు.. గెలిచిన అభ్యర్థులు తమిళనాడుకు తరలింపు?
- 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్
- మెజారిటీ తగ్గితే జాగ్రత్త పడాలని భావిస్తున్న నేతలు
- గత అనుభవాల నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించాలని యోచన
అయినప్పటికీ గెలిచిన తమ అభ్యర్థులను రక్షించుకునే పనిలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకవేళ ఇదే మెజారిటీ వస్తే ఏ సమస్యా ఉండదని, మెజారిటీ తక్కువగా ఉంటే జాగ్రత్త పడాలని భావిస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ గేమ్ ప్లాన్ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉండటం, ఆ పార్టీతో కాంగ్రెస్ కు మంచి సంబంధాలు ఉండటంతో గెలిచిన వారిని అక్కడికి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీంఎకే నేతలతో కర్ణాటక కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఎన్నికైన ఎమ్మెల్యేలను బెంగళూరుకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న పేర్కొంటున్నాయి.