కాంగ్రెస్ పార్టీకి ద్రవ్యోల్బణంపై మాట్లాడే హక్కు లేదు: నిర్మలా సీతారామన్
- ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి నిర్మల
- బొమ్మై ప్రభుత్వం పెట్రోల్‌పై రెండుసార్లు సుంకాన్ని తగ్గించిందన్న ఆర్థికమంత్రి
- డబుల్ ఇంజిన్ సర్కార్ తో వృద్ధి పరుగులు పెడుతుందని వ్యాఖ్య
తాను ప్రజల్లోనే ఉంటానని, కాబట్టి ధరలు మరింత తగ్గాల్సి ఉందని చెబుతున్నానని నిర్మలమ్మ అన్నారు. కానీ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే నైతిక హక్కు మాత్రం లేదన్నారు. ధరలు తగ్గించేందుకు 2014 నుండి మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. కర్ణాటకలో బసవరాజు బొమ్మై ప్రభుత్వం కూడా పెట్రోల్ పై రెండుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు చెప్పారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.