కొత్త దర్శకుడితో అఖిల్ సోషియో ఫాంటసీ .. టైటిల్ ఇదేనంటూ టాక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త దర్శకుడితో అఖిల్ సోషియో ఫాంటసీ .. టైటిల్ ఇదేనంటూ టాక్!

Akhil Next Movie Update
  • 'ఏజెంట్' ఫలితంతో నిరాశపడిన అఖిల్ 
  • సోషియో ఫాంటసీ జోనర్లో నెక్స్ట్ మూవీ 
  • దర్శకుడిగా అనిల్ పరిచయం 
  • యూవీ బ్యానర్లో రూపొందనున్న సినిమా
అఖిల్ హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్' సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. స్టైలీష్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే సురేందర్ రెడ్డి ఈ సినిమాను హిట్ దిశగా పరిగెత్తించలేకపోయాడు. ఈ సినిమా కోసం అఖిల్ పడిన శ్రమ అంతా కూడా వృథా అయిపోయింది. 

ఈ నేపథ్యంలో అభిమానుల దృష్టి ఇప్పుడు అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టుపై ఉంది. అతని నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? ఏ జోనర్ లో ఉంటుంది? టైటిల్ ఏమిటి? అనేది ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో.. అఖిల్ తన తదుపరి సినిమాను అనిల్ అనే కొత్త దర్శకుడితో చేయనున్నట్టుగా ఒక వార్త బలంగా వినిపిస్తోంది. 

ఈ కథ సోషియో ఫాంటసీ జోనర్ లో నడుస్తుందని అంటున్నారు. 'ధీర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. దాదాపు అదే టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. ఇక కథనాయికగా ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా, త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు. 
Advertisement
Akhil
Anil
Tollywood

More Telugu News