సెన్సార్ పూర్తిచేసుకున్న 'కస్టడీ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెన్సార్ పూర్తిచేసుకున్న 'కస్టడీ'

Custody Movie Update
  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'కస్టడీ'
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న కొత్త పాయింట్ 
  • వెంకట్ ప్రభుకి తెలుగులో ఇది ఫస్టు సినిమా 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల  
నాగచైతన్య హీరోగా 'కస్టడీ' సినిమా రూపొందింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఇది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, U/A సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళంలోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అక్కడ స్టార్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన రికార్డు వెంకట్ ప్రభుకి ఉంది. 

ఈ సినిమాలో ఒక సాధారణమైన పోలీస్ గా చైతూ కనిపించనున్నాడు. కథ ప్రకారం విలన్ బ్రతికి ఉండటం హీరోకి అవసరం. అతణ్ణి కాపాడుకోవడం కోసమే హీరో రిస్క్ చేస్తుంటాడు. అందుకు కారణం ఏమిటనేది కథ. కొంతకాలంగా చైతూ .. కృతి ఇద్దరూ కూడా ఫ్లాప్స్ లోనే ఉన్నారు. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హిట్ పడుతుందేమో చూడాలి.
Advertisement
Nagachaitanya
Krithi Shetty
Custody Movie

More Telugu News