జీవో నెంబర్ 1ను కఠినంగా అమలు చేయాలని జగన్ ఆదేశించడం దారుణం: తులసిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవో నెంబర్ 1ను కఠినంగా అమలు చేయాలని జగన్ ఆదేశించడం దారుణం: తులసిరెడ్డి

Tulasi Reddy fires on Jagan
  • జీవో నెంబర్ 1 అప్రజాస్వామికమన్న తులసిరెడ్డి
  • రాజకీయ పార్టీలు, ప్రజలు నోరెత్తకుండా చేసే కుట్ర అని విమర్శ
  • వైఎస్, జగన్ ల పాదయాత్రలు కూడా రోడ్ల మీదే జరిగాయని వ్యాఖ్య
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 అప్రజాస్వామికమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ జోవోను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఇలాంటి దుస్సాహసం చేయలేదని చెప్పారు. విపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు గొంతెత్తకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇదని అన్నారు. 

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ ల పాదయాత్రలు కూడా రోడ్ల మీదే జరిగాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. జీవో నెంబర్ 1కు సంబంధించి హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండగానే జగన్ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సరికాదని అన్నారు. రోడ్ల మీద ర్యాలీలను నిషేధించడం రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని చెప్పారు.
Advertisement
Tulasi Reddy
Congress
GO No 1

More Telugu News