గ్రీన్ కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తేయాలి..ప్రముఖ ఎన్నారై డిమాండ్
- అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో బుధవారం యూస్-ఇండియా సమ్మిట్
- కార్యక్రమంలో ప్రసంగించిన ప్రముఖ భారత సంతతి వ్యాపార వేత్త అజయ్ జైన్ భుటోరియా
- గ్రీన్ కార్డులపై కంట్రీ లిమిట్ కారణంగా బ్యాక్ లాగ్ పెరుగుతోందని ఆవేదన
- ఈ పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్
- హెచ్-1బీ వీసాలపై లేని పరిమితి గ్రీన్ కార్డులపై ఎందుకని ప్రశ్న
హెచ్-1బీ వీసాపై లేని పరిమితి గ్రీన్ కార్డుపై ఎందుకని అజయ్ జైన్ ప్రశ్నించారు. అమెరికాలో ప్రస్తుతం 8.8 లక్షల మంది గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వీరిలో అత్యధికులు భారత్, చైనా వారేనని వెల్లడించారు. కొందరు పదేళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని, చట్టంలో మార్పులు చేయకపోతే మరో 50 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.