దంతెవాడ: జవాన్ శవపేటికను మోసిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
- జవాన్ల త్యాగం వృథా కానివ్వమన్న సీఎం భూపేష్
- నక్సలైట్లపై పోరాటం ఉద్ధృతం చేస్తామని వ్యాఖ్య
- కుటుంబ సభ్యుల రోదనల మధ్య స్వస్థలాలకు శవపేటికల తరలింపు
ఈ రోజు అమరజవాన్ల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించిన అనంతరం సీఎం భూపేష్ మాట్లాడుతూ... జవాన్ల త్యాగం వృథా కానివ్వమని చెప్పారు. నక్సలైట్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కాగా, అమర జవాన్ల మృత దేహాలను వాహనాలలో స్వస్థలాలకు తరలించే సమయంలో సీఎం భూపేష్... ఒక జవాన్ శవపేటికను తన భుజంపై మోశారు.