రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే బీజేపీకే లాభం: సీఎం బొమ్మై
- రాహుల్, ప్రియాంక ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందన్న బొమ్మై
- మే 10న జరిగే ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్య
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని విమర్శ
నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి కోసం పని చేస్తోందని చెప్పారు. అభివృద్ధిని కోరుకునే వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటు వేయరని, బీజేపీకే ఓటు వేస్తారని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చెప్పే సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితమని... తమ బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కోటాను పెంచిందని చెప్పారు. ప్రధాని మోదీ వెళ్లే ప్రతి చోట బీజేపీ గెలుస్తుందని అన్నారు.