ఈ చిన్నారి ట్యాలెంట్ కు ముగ్ధుడైన ప్రధాని మోదీ
- ఐదేళ్లకే కీబోర్డుపై స్వరాలు పలికిస్తున్న కన్నడ చిన్నారి
- తల్లి పాట పాడుతుంటే పియోనోపై స్వరాలు
- అసాధారణ ప్రతిభ అంటూ మెచ్చుకున్న ప్రధాని
ఈ పాటని కన్నడ రచయిత కేఎస్ నరసింహ స్వామి రచించారు. ఈ వీడియోని మొదట అనంత కుమార్ షేర్ చేశారు. దీన్ని ప్రధాని చూసి రీట్వీట్ చేశారు. ‘‘ఈ వీడియో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును పూయిస్తుంది. అసాధారణ ప్రతిభ, సృజనాత్మకత కలిగిన షలమలీకి శుభాకాంక్షలు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. పాటకు స్వరాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రతి 10వేల మందిలో ఒకరు ఈ చిన్నారి మాదిరిగా అసాధారణ ప్రతిభతో ఉంటారంటూ కామెంట్లు వస్తున్నాయి.