యూకేలో చీరకట్టుతో మారథాన్ లో పరుగు!
- మాంచెస్టర్ మారథాన్ లో ఒడిశా మహిళ సందడి
- దాదాపు 5 గంటల్లో మారథాన్ పూర్తిచేసిన మధుస్మిత
- చీరకట్టుతో పరుగెత్తలేరనే అపోహను తొలగించేందుకేనని వెల్లడి
మాంచెస్టర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మధుస్మిత గతంలోనూ పలు మారథాన్ లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కిందటి ఆదివారం మాంచెస్టర్ మారథాన్ జరిగింది. ఈ మారథాన్ లో పాల్గొన్న మధుస్మిత.. తొలిసారి చీరకట్టుతో పరుగెత్తారు. మొత్తం 42.5 కిలోమీటర్ల పరుగును 4.50 గంటలలో మధుస్మిత పూర్తిచేశారు. రోజూ చీరలో కనిపించే అమ్మ, నానమ్మ స్ఫూర్తితో, చీరకట్టుతో మహిళలు పరుగెత్తలేరనే అపోహను తొలగించేందుకు ఈ పోటీలో పాల్గొన్నానని మధుస్మిత తెలిపారు.