నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 183 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 46 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • రెండున్నర శాతానికి పైగా నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్ల విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 59,727కి పడిపోయింది. నిఫ్టీ 46 పాయింట్లు కోల్పోయి 17,660 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎంసీజీ, పవర్, ఇన్ఫ్రా సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.17%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.90%), విప్రో (1.63%), నెస్లే ఇండియా (1.63%), సన్ ఫార్మా (0.75%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.62%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.90%), రిలయన్స్ (-1.13%), టైటాన్ (-1.12%), బజాజ్ ఫైనాన్స్ (-0.72%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News