Advertisement

'జననాయగన్' విడుదల ఆలస్యంపై హీరో విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

SA Chandrasekhar REACTS to son Thalapathy Vijay
  • ఈ సినిమాకు అడ్డంకులు వస్తాయని విజయ్‌కి ముందే తెలుసన్న చంద్రశేఖర్
  • సెన్సార్ సర్టిఫికెట్, సినిమా లీక్ కావడంపై ఆందోళన లేదని వెల్లడి
  • సినిమా సాఫీగా విడుదలై ఉంటే ఆశ్చర్యపోయేవాళ్లమన్న చంద్రశేఖర్
ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తన కుమారుడి చివరి చిత్రం 'జననాయగన్' విడుదల ఆలస్యం కావడంపై ఆసక్తికరంగా స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకు అడ్డంకులు వస్తాయని తన కుమారుడు ముందే ఊహించాడని చెప్పారు.

సెన్సార్ సర్టిఫికెట్ జాప్యం, సినిమా లీక్ కావడంపై తాము ఆందోళన చెందడం లేదని తెలిపారు. ఈ సమస్యలు వస్తాయని తమకు ముందే తెలుసని అన్నారు. సినిమా సాఫీగా విడుదలై ఉంటేనే తాము ఆశ్చర్యపోయేవాళ్లమని పేర్కొన్నారు.

తాను రాజకీయాల్లోకి వెళుతున్న సమయంలో మీరు నాతో సినిమా చేయాలనుకుంటున్నారని, ఈ చిత్రానికి ఇబ్బందులు రావొచ్చని, వీటికి మీరు సిద్ధమేనా అని సినిమా కోసం సంతకం చేయడానికి ముందే విజయ్ నిర్మాతను అడిగినట్లు చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్నందున ఇబ్బందులు తలెత్తుతాయని అతడికి తెలుసని, రాజకీయ ప్రత్యర్థి కావడం వల్లే సినిమాను లీక్ చేశారని వ్యాఖ్యానించారు. కుటుంబాని కంటే ప్రజలకే విజయ్ ఓటు వేస్తారని అన్నారు.
Advertisement
Jana Nayagan' controversy
SA Chandrasekhar reacts to son Thalapathy Vijay
SA Chandrasekhar on Jana Nayagan

More Telugu News