ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న గంగూలీ, కోహ్లీ

ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న గంగూలీ, కోహ్లీ

Kohli Unfollows Sourav Ganguly on Insta
  • గంగూలీ టైంలోనే కెప్టెన్సీకి కోహ్లీ దూరం
  • నిన్న చేయి కలిపేందుకు నిరాకరించిన కోహ్లీ 
  • గంగూలీని కోహ్లీ అన్-ఫాలో చేయగా, గంగూలీ కూడా అదే దారిలో..  
సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రాంలో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీలు ఒకరినొకరు అన్-ఫాలో చేసుకున్నారు. గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా, కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుడిగా ఉన్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోహ్లీ కెప్టెన్సీకి దూరమయ్యాడు. ఈ విషయమై వీరిద్దరూ ఎప్పుడూ బయటపడనప్పటికీ, ఆ అంశం వారి మధ్య దూరానికి కారణంగా చెబుతారు. ఇప్పుడు వీరిద్దరు ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో కావడం లేదనే విషయం వెలుగు చూసింది.

ఢిల్లీతో మ్యాచ్ అనంతరం గంగూలీని కోహ్లీ అన్-ఫాలో చేయగా... గంగూలీ కూడా అదే దారిలో నడిచాడు. ఇన్ స్టాలో గంగూలీకి 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా, 106 మందిని అనుసరిస్తున్నాడు. కోహ్లీకి 246 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, 276 మందిని అనుసరిస్తున్నాడు. 

అయితే వీరు ఇరువురు ఒకరినొకరు మాత్రం ఫాలో కావడం లేదు. ఇటీవల మ్యాచ్ అనంతరం గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ నిరాకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
Advertisement
virat kohli
sourav ganguly

More Telugu News