మంత్రి గంగుల కమలాకర్ కు తప్పిన ప్రమాదం
- కరీంనగర్ జిల్లా పర్యటనలో అపశృతి
- చెర్లబుట్కూర్ లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కమలాకర్
- ఒక్కసారిగా కుప్పకూలిన సభా వేదిక
- మంత్రి కాలుకు గాయం
- విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన డాక్టర్లు
ఆయనకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన ఓ జడ్పీటీసీ సభ్యుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి కమలాకర్ మీడియాతో మాట్లాడారు. సభావేదిక కూలిన ఘటనలో స్వల్ప గాయాలయ్యాయని, డాక్టర్లు చికిత్స చేశారని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని వెల్లడించారు.