కుషాయిగూడ టింబర్ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
- పక్కనే ఉన్న భవనానికి వ్యాపించిన మంటలు
- తప్పించుకునే మార్గం లేక మంటల్లో ఆహుతి
- కనిపించకుండా పోయిన మరో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు
- ప్రమాద కారణంపై పోలీసుల ఆరా
దంపతుల మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (5)గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే, కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు.