మేకల్ని బలి ఇస్తారు, పులులను బలి ఇవ్వరు... కాబట్టి పులుల్లా బతకండి: పవన్ కల్యాణ్
- అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నానన్న పవన్
- భరత జాతికి మహా సూత్రాలను అందించిన గొప్ప నేత అని కితాబు
- అంటరానితనాన్ని నిర్మూలించడానికి జీవితాంతం కృషి చేశారని ప్రశంస
మేకలను బలి ఇస్తారని, పులులను బలి ఇవ్వరని... అందుకే అందరూ పులుల్లా బతకాలని చెపుతూ అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని అంబేద్కర్ పెంచారని పవన్ తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పిస్తున్నాని చెప్పారు.