'దసరా'లో క్రికెట్ సీన్ హైలైట్ .. వీడియో రిలీజ్ చేసిన టీమ్!
- మార్చి 30న వచ్చిన 'దసరా'
- మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన కంటెంట్
- రెండు వారాల్లో భారీ వసూళ్లు
- సినిమా హైలైట్స్ లో క్రికెట్ సీన్ ఒకటి
అలాంటి ఈ సినిమాలో క్రికెట్ కి సంబంధించిన ఒక సీన్ ఉంది. తన స్నేహితుడి కోసం విలన్ సమక్షంలో నాని ఈ క్రికెట్ లో తప్పకుండా గెలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తమ టీమ్ ఓటమి చివరికి వెళ్లినప్పుడు నాని ఒక్కసారిగా చెలరేగిపోతాడు. థియేటర్లో ఈ సీన్ మంచి కిక్ వచ్చేలా చేస్తుంది.
అలాంటి క్రికెట్ గేమ్ కి సంబంధించిన వీడియోను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ క్రికెట్ ఎపిసోడ్ లో నానీలోని స్టైల్ ను ఆవిష్కరించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్ లో హుషారెత్తించే సన్నివేశాలలో ఇది ఒకటి.