చదువురాని సన్నాసి బండి సంజయ్ : ఎమ్మెల్యే సుమన్
- జైలు నుంచి విడుదలైన తర్వాత సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న సుమన్
- ఏదో ఘనకార్యం చేసినట్టు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్లు చేస్తున్నారని మండిపాటు
- సింగరేణికి కేంద్రం బొగ్గు బ్లాకులు ఇవ్వలేదని విమర్శ
సింగరేణి బొగ్గు బ్లాకులను తేదీల వారీగా వేలం పెట్టిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని... వీటి గురించి గత 2021లో ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాసినప్పటికీ సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇవ్వలేదని సుమన్ మండిపడ్డారు. సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా వేలానికి పెట్టారని దుయ్యబట్టారు.