గుడివాడ పర్యటనపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష
- ఈ నెల 12న మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'
- ఈ నెల 13న గుడివాడలో రోడ్ షో, సభ
- ఈ నెల 14న గుడివాడలో అంబేద్కర్ జయంతి
- నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభించనున్న చంద్రబాబు
అంబేద్కర్ జయంతిని గుడివాడలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిమ్మకూరులో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 12న మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు నిమ్మకూరులో బస చేయనున్నారు.
ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు గుడివాడలోనే బస చేయనున్నారు. ఈ నెల 14న ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.