Prabhas: 'దసరా' చిత్రంపై ప్రభాస్ ఏమన్నారంటే...!

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన చిత్రం దసరా. మార్చి 30న రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ అందుకుంది. కాగా, దసరా చిత్రాన్ని టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కూడా వీక్షించారు. అనంతరం, ఈ చిత్రంపై తన అభిప్రాయాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. "ఏం సినిమా... దసరా అదిరిపోయింది. ఇప్పుడే ఈ సినిమా చూశాను. హీరో నానీకి అభినందనలు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. నాని, కీర్తి సురేశ్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు" అంటూ ప్రభాస్ పోస్టు చేశారు. 

ప్రభాస్ పోస్టుపై నాని స్పందించారు. ప్రభాస్ అన్నా కృతజ్ఞతలు అంటూ సంతోషం వెలిబుచ్చారు. అటు, కీర్తి సురేశ్ కూడా దసరా చిత్రాన్ని ప్రభాస్ చూడడం, స్పందన తెలియజేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
Prabhas
Dasara
Nani
Tollywood

More Telugu News