ఏకంగా షారుక్ ఖాన్​ను దాటి అగ్రస్థానం సాధించిన రాశీ ఖన్నా

Raashi Khanna Beats Shah Rukh Khan on IMDB
  • ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో రాశీకి టాప్ ప్లేస్
  • ఫర్జీ వెబ్ సిరీస్ లో ఆమె పాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు
  • అన్ని భాషల్లో ఆకట్టుకున్న ఫర్జీ సిరీస్
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన అందాల నటి రాశీ ఖన్నా. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడలో నటించిన రాశీ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది. రుద్ర, ఫర్జీ వెబ్ సిరీస్ లతో ప్యాన్ ఇండియా నటిగా మారింది. రుద్ర వెబ్‌ సిరీస్‌లో నెగెటివ్ రోల్ పోషించిన ఆమె ఫర్జీలో తెలివైన బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది. ఫ్యామిలీ మ్యాన్ రూపొందించిన రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ అన్ని భాషల్లో మంచి ఆదరణను దక్కించుకుంది. దాంతో, రాశీకి దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. 

ఈ నేపథ్యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో రాశీ ఖన్నా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏకంగా బాలీవుడ్ బడా స్టార్ షారూఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సాధించి ఔరా అనిపించింది. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డానని రాశీ చెప్పింది.ఈ విషయాన్ని మొదట తాను నమ్మలేదని, నిజమో కాదో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టిందని తెలిపింది. 

తన తండ్రికి ఫోన్ చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నానని తెలిపింది. ‘ఆయనకు ఐఎండీబీ గురించి ఏం తెలియదు. కానీ, నేను షారుఖ్ ఖాన్‌ కంటే మొదటి స్థానంలో ఉన్నానని చెప్పగానే ఆయన షాక్‌‌కు గురయ్యారు. నా జీవితంలో దీనిని ఓ మైలు రాయిగా భావిస్తాను’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Raashi Khanna
Shahrukh Khan
IMDB
NO1
Tollywood
Bollywood

More Telugu News